29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల దిష్టిబొమ్మ దహనం

Must read

📰 Generate e-Paper Clip

  • దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి బైఎలక్షన్ కు రండి
  • బిఆర్ఎస్ నాయకులు కంచర్ల రవి గౌడ్

 

రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ : పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని బీఆర్ఎస్ నేత కంచర్ల రవి గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చేనేత విగ్రహం వద్ద పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పార్టీపై గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు మేము పార్టీ మారలేమంటూ మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే వెంటనే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి బై ఎలక్షన్‌కు రావాలని డిమాండ్ చేశారు. ధైర్యం లేకపోయే కారణంగానే రాజీనామా చేయకుండా కుర్చీలకు అతుక్కుపోయారని ఆరోపించారు.  కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారని ఆరోపించారు . ఇప్పుడు బీఆర్ఎస్ లోనే ఉన్నామనడం ప్రజలకే అవమానమని,తెలంగాణ ప్రజలు మీ అందరినీ అసహ్యించుకుంటున్నారు” అని వ్యాఖ్యానించారు.“రేవంత్ రెడ్డి పాట పాడుతూ తిరిగే మీరు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు ఎందుకు రావడం లేదని  ప్రజల కష్టాలపై మాట్లాడే ధైర్యం మీకుందా అని ప్రశ్నించారు.రాబోయే రోజుల్లో ప్రజలు మిమ్మల్ని క్షమించరని హెచ్చరిస్తున్నమన్నారు. ఇప్పటికైనా దమ్ము ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి” అని సవాల్ విసిరారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్.కే. అఫ్రోజ్, బూత్ కురి శివరాజ్, కోడం వెంకటేశం, ముద్దం అనిల్ గౌడ్, అందే సుదర్శన్, హరీష్, శ్రీనివాసరావు జగన్, నరేష్, రాము తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article