29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

అర్ధరాత్రి వరకు స్టార్ హోటళ్ళు

Must read

📰 Generate e-Paper Clip

  •  నిశిరాత్రి వరకు మద్యం అమ్మకాలు
  • రాత్రి బార్లా తెరిచిన పాన్ షాప్ లు
  • చిన్నచితక చాయ్ హోటళ్ళపై పోలీసుల ప్రతాపం
  • నగరం మొత్తం ఇదే తంతు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోస్టు ఖాళీగా ఉండడం నగర శాంతిభద్రతలపై  ప్రభావం చూపుతుంది. నగరంలో విచ్చలవిడిగా నిశచర జీవులు (తాగుబోతులు), జూదగాళ్లు ఇష్టారీతిన తిరుగుతున్నారు. గతంలో పోలీసు కమిషనర్ గా పని చేసిన అధికారులు నగరంలో టప్ప చబుత్తర్ నిర్వహించే వారు. కార్టెన్ సెర్చ్ లను నిర్వహించేవారు. రాత్రివేళ అయిందంటే డ్రంక్ అండ్ డ్రైవ్ లు  నిర్వహించేవారు. ప్రస్తుతం నిజామాబాద్ కొత్వాల్ పోస్టు ఖాళీగా ఉండడంతో ఏసీపీ మొదలుకుని సిఐలు, ఎస్సైలు తమ  ప్రాంతాలలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను లైట్ గా తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం నిజామాబాద్ నగరంలో గోషాల వద్ద యువకుడి హత్య కలకలం  రేపింది. రాత్రివేళ రూల్ ప్రకారం మద్యం  షాప్ లు ఉదయం 10 గంటలకు తెరిచి రాత్రి 10 గంటలకు మూసివేసినా మద్యం అమ్మకాలు మాత్రం 24 గంటలు కొనసాగుతున్నాయి. బార్లలో మద్యం దుకాణాల మాదిరిగా విడిగా మద్యాన్ని బయటకు విక్రయించడం జోరుగా సాగుతుంది. ఇలా ఉండగా ఉదయం నుంచి రాత్రి వరకు మద్యం దుకాణాలకు కొదవ లేకుండా సాగుతున్నాయి. మద్యం దుకాణాలు తెరిచి ఉండడంతో మందు బాబులు, రాత్రివేళ నిశచర జీవులు సంచారం  జరిగింది. వారు సేవించే మద్యంతో పాటు మత్తును ఇచ్చే  పాన్ షాప్ లు కూడా తెరిచి  ఉంచుతున్నారు. రాత్రి 9 గంటలు గడిచిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ లకు తెరపడుతుంది. దానితో మందు బాబులు వీరంగం పెరిగిపోతుంది. వారికి రాత్రివేళ వండివార్చడానికి స్టార్ హోటళ్ళు మొదలుకుని పెద్ద హోటళ్ళు బార్లా తెరిచే ఉంటున్నాయి. నగరంలోని స్టార్ హోటళ్ళతో పాటు బార్లలో రాత్రి వరకు సిట్టింగ్ లు కొనసాగిస్తున్నారు.  దానితో మందు,మంచింగ్ కోసం నగరంలోని 1,2,4,6, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హోటళ్ళను తెరిచి స్వాగతం పలుకుతున్నాయి. మందుబాబులతో అర్ధరాత్రి వరకు ఆర్డర్ల ప్రకారం బిర్యానీలు అందజేస్తున్న వారిని వదిలి బేకరిలు, చాయ్ హోటళ్ళ నిర్వాహకులపై పోలీసులు ప్రతాపం చూపుతున్నారు. వారిని సిటి న్యూసెన్స్ యాక్టు  కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచితే ఒకటి, రెండు రోజుల సాధారణ జైలు శిక్ష తోనే  తప్పించుకుంటున్నారు. స్టార్ హోటళ్ళు, బడా హోటళ్ళు, షాపింగ్ కాంప్లెక్స్ ల నిర్వాహకులను మాత్రం వదిలివేయడంతో వారు రాత్రి , పగలు తేడా లేకుండా అమ్మకాలు చేస్తున్నారు. వారితో స్థానిక పోలీసు వర్గాలతో మిలాఖత్ అయ్యారనే ఆరోపణలున్నాయి. అందుకే నిజామాబాద్ నగరంలో బడా బడా హోటళ్ళ నిర్వాహకులు, పాన్ షాప్ ల నిర్వాహకులు, స్టార్ హోటళ్ళ నిర్వాహకులు అర్ధరాత్రి వ్యాపారం చేసినా  పట్టించుకోరనే విమర్శలు ఉన్నాయి. కొత్త కమిషనర్ వస్తే గానీ నగరంలో శాంతిభద్రతలు గాడిన పడే పరిస్థితి లేదు.

More articles

Latest article