27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్ లో చేరిక

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ మండలం ఎల్లమ్మ కుంట గ్రామంలో బిఆర్ఎస్, బిజెపి కీలక నాయకులు సహా 50 మంది ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ రూరల్ క్యాంప్ కార్యాలయంలో  ఆదివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ.. “కాంగ్రెస్ పేదల పార్టీ. అందిస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, నాయకులు మా వైపు ఆకర్షితులవుతున్నారు” అని అన్నారు. ఎస్టిలకు అన్ని సౌకర్యాలు, రిజర్వేషన్లు కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత రేషన్ కార్డు, ఉచిత సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, రైతు బీమా, రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలే కాంగ్రెస్ బలోపేతానికి కారణమని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు కమీషన్ల రాజకీయాలు చేసి ప్రజలకు న్యాయం చేయలేదని విమర్శించారు. రాబోయే ఎల్లమ్మ కుంట సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మాజీ ఎంపీపీ యాదగిరి నేతృత్వంలో మాజీ ఉప సర్పంచ్ రమేష్ నాయక్, నందియా, బలిగం లక్ష్మణ్, లింగం, శ్రీను,మోహన్, రెడ్డి వసంతరావు తదితరులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి  మోహన్,  డాన్ శీను, రవీందర్ దేవిదాస్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article