25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

న్యాయవాదిపై దాడికి నిరసనగా విధులు బహిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

న్యాయవాద ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటుకు డిమాండ్

నిజామాబాద్, బతుకమ్మ :  హైదరాబాద్ లోని నాంపల్లి కోర్ట్  బార్ అసోసియేషన్ న్యాయవాది మొహమ్మద్ ముత్తభ అలి పై దాడిని నిరసిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించినట్లు బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ తెలిపారు. మంగళవారం జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హాల్ లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయవాది మహమ్మద్ ముత్తబా అలి పై దుండగులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇందుకు నిరసనగా తమ విధులను బహిష్కరించినట్లు పేర్కొన్నారు. న్యాయవాది ముత్తబ్బ అలిపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని  కోరారు. న్యాయవాదుల ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టం ఆమోదించడానికి అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించి చట్టం తేవడానికి సహకరించాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా తమ ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి వసంత్ రావ్, ఉపాధ్యక్షులు పెండం రాజు, సంయుక్త కార్యదర్శి దొంన్పాల్ సురేష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డి, న్యాయవాదులు అయ్యొబ్ విఘ్నేష్, పడేగేల వెంకటేశ్వర్, బిట్లా రవి, శ్రీధర్,  సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

More articles

Latest article