26.2 C
Hyderabad
Wednesday, August 5, 2026

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు నిదర్శనం బోనాలు

Must read

📰 Generate e-Paper Clip

 

వేల్పూర్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలకు బోనాలు నిదర్శనమని నిజామాబాద్ జిల్లా టీఎన్జీవోస్ ఉపాధ్యక్షుడు బత్తుల మాణిక్యం అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో టీఎన్జీవో ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి పండుగ యొక్క సాంప్రదాయాలు విలువలు తెలియాలంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని, ఫలితంగా ప్రతి ఒక్కరు పండుగల పై అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు. పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. కన్నుల పండుగగా బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీసీలు వెన్న మురళి, లక్ష్మి, సరళ, వరలక్ష్మి, సునీత, వివో ఏ మురళీ మోహన్, ఆపరేటర్ దివ్య తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article