తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు నిదర్శనం బోనాలు
వేల్పూర్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలకు బోనాలు నిదర్శనమని నిజామాబాద్ జిల్లా టీఎన్జీవోస్ ఉపాధ్యక్షుడు బత్తుల మాణిక్యం అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో టీఎన్జీవో ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి పండుగ యొక్క సాంప్రదాయాలు విలువలు తెలియాలంటే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని, ఫలితంగా ప్రతి ఒక్కరు పండుగల పై అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు. పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. కన్నుల పండుగగా బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీసీలు...