26.2 C
Hyderabad
Wednesday, August 5, 2026

రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్‌లో ప్రథమ స్థానం సాధించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సర్పంచ్ భోగ నిత్యానంద్

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా జట్టును ప్రథమ స్థానంలో నిలపాలని సర్పంచ్ భోగ నిత్యానంద్ ఆకాంక్షించారు. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తిలో ఆగస్టు 7 నుంచి 9 వరకు జరగనున్న 72వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళా, పురుషుల బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు ఎంపికైన నిజామాబాద్ జిల్లా మహిళా జట్టుకు మోర్తాడ్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఈ శిక్షణ శిబిరాన్ని మోర్తాడ్ గ్రామ సర్పంచ్ భోగ నిత్యానంద్ సందర్శించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో మాట్లాడిన ఆయన మోర్తాడ్ బాలికల పాఠశాలలో జిల్లా జట్టుకు శిక్షణ శిబిరం నిర్వహించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. క్రీడాకారులు ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని, రాబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయాన్ని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. క్రీడాకారులకు వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు, బాలికల హాస్టల్ ఇన్‌చార్జ్‌ లకు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్, బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి బోనగిరి శ్యామ్, నిర్వహణ కార్యదర్శి నాగేష్, ఉపాధ్యాయులు రవీందర్, రవి, దీపిక తదితరులు పాల్గొన్నారు.

 

We must secure first place in state-level ball badminton.

More articles

Latest article