రెడ్ క్రాస్ సభ్యత్వ విస్తరణకు బోధన్ ఆర్డీఓ సానుకూల స్పందన

  బోధన్, బతుకమ్మ :   రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ విస్తరణ కార్యక్రమంలో భాగంగా బోధన్ డివిజన్ ఆర్డీఓ విజయకుమారి ని రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలు, సభ్యత్వం ప్రాధాన్యత గురించి వివరించారు. దీనికి ఆర్డీఓ సానుకూలంగా స్పందిస్తూ తమ కార్యాలయ సిబ్బంది మాత్రమే కాకుండా ఇతర ప్రభుత్వ అధికారులతో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం బోధన్ ఎం.ఆర్.ఓ విట్టల్...