విద్యుత్ ఉద్యోగుల రక్తదానం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: తలసేమియా బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు రక్తదానం చేశారు. గోల్డెన్ జుబ్లీ మీటింగ్ హాలులో ఏర్పాటు చేసిన విద్యుత్ ఉద్యోగుల రక్తదాన శిబిరాన్ని ఎస్ ఈ రాపెల్లి రవీందర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో సంస్థ ఉద్యోగులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బి ఆంజనేయులు, డీఈలు జాడే ఉత్తమ్, వెంకటరమణ,...