34.3 C
Hyderabad

రక్తదానం అభినందనీయం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఆపద సమయంలో రక్తదానం చేయడం అభినందనీయమని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్ లో జిల్లా ట్రెజరీ శాఖ అధికారులు, సిబ్బంది మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆపద సమయంలో మరొకరికి రక్తం అవసరం ఉంటుందని, అలాంటి వారికి రక్తదానం చేయడం ప్రాణదానం చేసినవారవుతారని అన్నారు. రక్తదాన శిబిరాలను నిర్వహించాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ ఏం.రాజన్న, జిల్లా కోశాధికారి వెంకటేశ్వర్లు, టీఎన్జీవో వెంకట్ రెడ్డి, ఎస్టీవో సాయిరెడ్డి, రెడ్ క్రాస్ ప్రతినిధులు డాక్టర్ దేవేందర్, డాక్టర్ పీవీ నరసింహం, ట్రెజరీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article