27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆశీర్వదించండి . . అభివృద్ధి చేసి చూపిస్తా

Must read

📰 Generate e-Paper Clip

. . . బిచ్కుంద మున్సిపాలిటీ మూడవ వార్డు నుండి బరిలోకి దిగనున్న సాయిని బస్వరాజ్

 

బిచ్కుంద, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీలోని మూడవ వార్డు నుండి మీ బిడ్డని ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని మంగళవారం సాయిని బస్వరాజ్ “బతుకమ్మ”జర్నలిస్టు తో ముఖాముఖి మాట్లాడారు. బిచ్కుంద మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకత్వంలో క్రియాశీలక వ్యక్తి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  సహాయ సహకారాలతో బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల బరిలో నిల్చుంటానని కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు సాయిని బస్వరాజ్ స్పష్టం చేశారు. చాలా రోజులుగా పార్టీ కోసం సేవ చేస్తూ ఏ పదవి ఆశించకుండా పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఉన్నానని తెలిపారు. బిచ్కుంద మండలం లో గతంలో వార్డ్ మెంబర్ గా ఉన్నప్పుడు ఎన్నో పనులు చేయడం జరిగిందని ప్రజలు ఆశీర్వదించినట్టయితే మరింత ఉత్సాహంతో అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. తాను గెలిచిన కాలనీలో డ్రైనేజీలు కట్టడం, సీసీ రోడ్లు వేయడం, తాగునీటి సౌకర్యం కొత్త బోర్లు వేయడం, వీధిలైట్లు, వృద్ధులు, వితంతులు, వికలాంగులకు స్వయంగా ఇంటికి వెళ్లి పెన్షన్ ఇప్పించడంలో క్రియాశీలకంగా వ్యవహరించానని, బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని గోపురాలకు, అవసరాలకు ఆర్థిక సాయం అందజేస్తూ, మున్నూరు కాపు ముద్దు బిడ్డగా సుపరిచితులుగా కలిసి, మెలిసి అందరి తో మమేకమై ఉన్నానని ఆయన పేర్కొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ జనాలతో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎలాంటి పదవి ఆశించని సాయిని బస్వరాజ్ కు అవకాశం ఇవ్వాలని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. బిచ్కుంద బిడ్డగా సాయిని బస్వరాజ్ కు మైనార్టీ వర్గాల నుండి మంచి మద్దతు ఉండడంతో, మున్నూరు కాపు బిడ్డకు మంచి అవకాశాలు కలిసి వచ్చే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

More articles

Latest article