బీజేపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచెయ్యాలి

0 14,566
  • బీజేపీ మండల అధ్యక్షులు బేల్దారి నవీన్

 

 వేల్పూర్, బతుకమ్మ : రానున్న స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చెయ్యాలని మండల పార్టీ అధ్యక్షులు బేల్దారి నవీన్ సూచించారు. బుధవారం మండల కార్యాశాల సమావేశంను సమావేశాన్ని బుధవారం మండల కేంద్రంలోని శుక్రవారం దేవి ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ మండల కార్యశాల సమావేశానికి ముఖ్యఅతిథిగా మండల ప్రబారి మూల్గె మహిపాల్,  బాల్కొండ అసెంబ్లీ కన్వీనర్ మోహన్ పాల్గొన్నారు. ఈ వర్క్ షాప్ లో కార్యకర్తలనిద్దేశించి మండల అధ్యక్షుడు బేల్దారి నవీన్ మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి మొదలుకొని జిల్లా స్థాయి స్థానాలు కైవసం చేసుకునే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. భారతీయ జనతా పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త ఒక ఛాలెంజ్ గా తీసుకొని,స్థానిక సంస్థలో గెలుపు దిశగా పని పనిచేసి మండలంలోని అన్ని స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుని రాష్ట్రంలో ముందంజలో ఉండాలని  కోరారు. గత 18 నెలల కాలంలో కాంగ్రెస్ పరిపాలనలో, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు.స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈ పది సంవత్సరాల పరిపాలనలోచేసిన పథకాలు ప్రజల్లోకి గడప గడపకు చేర్చాలని కార్యకర్తలకు సూచించారు.పార్లమెంట్ సభ్యులైన ధర్మపురి అరవింద్ సాధించిన ప్రగతి  ప్రతి గ్రామంలో వివరించాలని తెలిపారు ఈ తెలంగాణలో గత పది సంవత్సరాల్లో లక్షల కోట్లతో అభివృద్ధి పనులను చేశామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా బూత్ స్థాయిలో ఉన్న ప్రతీ కార్యకర్తలు స్థానిక సంస్థల దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని కోరారు. భారతీయ జనతా పార్టీకి ఈ సమయంలో మంచి వాతావరణం ఉందన్నారు. గ్రామ మండల జిల్లా స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎలక్షన్ ఇంచార్జి నోముల నర్సారెడ్డి,జనరల్ సెక్రెటరీ పెద్దోళ్ల నాగేష్, మండల ఉపాధ్యక్షులు రాజగంగారం,కార్యదర్శి సతీష్, తీగల మోహన్ ,బాస గంగాధర్, రాజారెడ్డి నోముల, రమేష్ మాజీ మండల అధ్యక్షుడు, ఏలేటి రమేష్ రెడ్డి జె కృష్ణారెడ్డి డాక్టర్ ప్రసాద్, ఎక్స్ ఎంపిటిసి రవి, పోతుల బాలకిషన్,లక్కోరా శ్రీనివాస్,మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.