29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

‘మహా’ విజయంతో బీజేపీ సంబురాలు

Must read

📰 Generate e-Paper Clip

BJP celebrates with 'Maha' victory

నిజామాబాద్, బతుకమ్మ: మహారాష్ర్ట అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి(మహాయుతి) విజయం సాధించడంతో జిల్లాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి ఆధ్వర్యంలో నాయకులు పటాకులు కాల్చారు. స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ధన్ పాల్ మాట్లాడుతూ.. మహారాష్ర్ట ఫలితాలు బీజేపీకి ప్రజల్లో ఉన్న ఆదరణను నిరూపించాయన్నారు. రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గల్లంతైందన్నారు. తెలంగాణలో హామీలు నెరవేర్చలేని రేవంత్ మహారాష్ర్ట కు వెళ్లి ప్రచారం చేస్తే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతిరెడ్డి, కార్పొరేటర్ చుక్క మధు, పల్లె గంగారెడ్డి, పోతన్ కర్ లక్ష్మీనారాయణ, స్వామియాదవ్, గద్దె భూమన్న  తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article