‘మహా’ విజయంతో బీజేపీ సంబురాలు
నిజామాబాద్, బతుకమ్మ: మహారాష్ర్ట అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి(మహాయుతి) విజయం సాధించడంతో జిల్లాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని నిఖిల్ సాయి చౌరస్తాలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి ఆధ్వర్యంలో నాయకులు పటాకులు కాల్చారు. స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ధన్ పాల్ మాట్లాడుతూ.. మహారాష్ర్ట ఫలితాలు బీజేపీకి ప్రజల్లో ఉన్న ఆదరణను నిరూపించాయన్నారు. రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గల్లంతైందన్నారు. తెలంగాణలో హామీలు నెరవేర్చలేని...