24.7 C
Hyderabad
Monday, August 3, 2026

విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరి బైండోవర్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూర్: పోలీసుల డ్యూటీకి ఆటంకం కలిగించిన ఇద్దరి  ని సోమవారం బైండోవర్ చేసామని భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఎస్సై తెలిపిన సమాచారం ప్రకారం తిప్పాపూర్ గ్రామంలో పెట్రోలింగ్ డ్యూటీ చేస్తుండగా వారి డ్యూటీకి ఆటంకం చేసిన వ్యక్తి ఫోన్లో వీడియోలు తీసి పోలీసు వారు అరెస్టు చేయడానికి వచ్చారని తప్పుడు ప్రచారం చేసి వైరల్ చేసిన ఇల్లెందుల ప్రభాకర్, ఇల్లెందుల నరేష్ ల పై కేసు నమోదు చేసి భిక్కనూరు తహసిల్దార్ శివప్రసాద్  ముందు బైండోవర్  చేశామన్నారు. పోలీసుల డ్యూటీకి ఎవరైనా ఆటకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

More articles

Latest article