- మాజీ సర్పంచ్ షేక్ ఖాదర్
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామంలో మాజీ సర్పంచ్ షేక్ ఖాదర్ ఆధ్వర్యంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన 55 ఇళ్లకుగాను 41 మంది లబ్ధిదారులు పనులు ప్రారంభించగా, 14 మంది ఆర్థిక స్తోమత సరిగా లేక నిర్మించుకోలేదు. దీంతో 14 మంది అర్హులైన కొత్త లబ్ధిదారులను గ్రామపంచాయతీ తీర్మానం మేరకు ఎంపిక చేసి అధికారులకు అందజేశామన్నారు. అధికారుల అనుమతితో 55 మంది లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకున్నారని ఇటీవల అధికారులు చేసిన విచారణలో కూడా ఈ విషయం వెళ్లడైందన్నారు. స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సహకారంతో అందరికీ బిల్లులు వచ్చేటట్టు కృషి చేస్తున్నరని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 600 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, సగానికి పైగా ఇల్లు నిర్మించకుండానే బిల్లులు స్వాహా చేసినట్టు తెలుస్తోందన్నారు. దీనిపై ప్రజావాణిలో కూడా ఎంపీడీవోకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ విషయమై అధికారులు సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు.