- విద్యార్థుల ఇబ్బందులు
- పాఠశాలలో వసతుల లోపం విద్యార్థుల బాధలు
- విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం
బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థుల తరగతి గదులు లేక నిర్మాణంలో ఉన్న గదులలో నేలపై విద్యార్థులు విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. సరైన మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు కాంట్రాక్టు పనులు దక్కించుకున్న గుత్తెదారు నిర్మాణ పనులను కొనసాగిస్తూ అర్ధాంతరంగా పనులు ఆపేసి వెళ్లిపోయారు విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడం విద్యార్థులకు ఉపాధ్యాయులకు సమస్యగా మారింది. ఈ పాఠశాలలో 300కు పైగా విద్యార్థులు ఉన్నప్పటికీ అందుబాటులో ఉన్న గదులు కేవలం నాలుగు మాత్రమే.

- విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం..
విద్యార్థులు నెమ్మదిగా చదువులో ఆసక్తి కోల్పోతున్నారు. వర్షాలు పడే సమయంలో చదువు నిలిపివేయాల్సిన పరిస్థితి వస్తున్నాయని అధ్యాపకులు మరియు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు తగిన వసతులు కల్పించడం ప్రభుత్వం బాధ్యత అని వారు అంటున్నారు. ఇప్పటికైనా నిర్మాణ పనులు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

