29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

జిన్నింగ్ మిల్లు, అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ తనిఖీ

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా అదనపు కలెక్టర్ వి.విక్టర్

 

మద్నూర్, బతుకమ్మ: మంగళవారం కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ వి విక్టర్ మద్నూర్ మండలంలో అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు. తెలంగాణ రాష్ట్రం లో వరి కోనుగోలు కేంద్రాలు కొనసాగుతున్నాయి. సన్న వడ్లకు 500 బోనస్ ను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నందున ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రం లోకి సన్న వడ్లు రాకుండా రాష్ట్ర సరిహద్దు వద్ద చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదే విధంగా పత్తి పంటను మార్కెట్ కు వస్తున్నందున దానికి సంబంధించిన జిన్నింగ్ మిల్లు ను పరిశీలించారు. మిల్లులో తీసుకుంటున్న జాగ్రత్తలు ఏర్పాట్లను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని మార్కెట్ కమిటీ కార్యదర్శిని ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్ ఎం డి ముజీబ్, సివిల్ సప్లై నాయబ్ తహసిల్దార్ ఖలీద్, రెవెన్యూ, పోలీస్, మార్కెట్ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

nspection of ginning mill, interstate border check post

More articles

Latest article