- శుభ్ మన్ గిల్ సెంచరీ
- ఛాంపియన్స్ ట్రోఫీలో శుభారంభం
వెబ్ డెస్క్, బతుకమ్మ : ఛాంపియన్స్ ట్రోఫీని టీంఇండియా విజయంతో ప్రారంభించిది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 46.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 231 చేసి విజయం సాధించింది. భారత ఓపెనర్ శుభ్ మన్ గిల్ (101నాటౌట్) బాదాడు. కేరీర్ లో ఇది 8వ శతకం కాగా.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెంచరీ కావడం విశేషం. తొలి వికెట్ కు మరో ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి 10 ఓవర్ల లోపే 69 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. రోహిత్ ఔటైన తర్వాత క్రిజ్ లోకి వచ్చిన విరాట్(22) కాస్త ఆచితూచి ఆడాడు. షాట్లు కొట్టకుండా సింగిల్స్ కు పరిమితమయ్యాడు. శ్రేయస్ అయ్యర్ (15) చూడచక్కని ఆటతీరు ప్రదర్శించాడు. శ్రేయస్, అక్షర్ పటేల్ ఔటైన తర్వాత కేఎల్ రాహుల్ (40నాటౌట్)తో కలిసి జట్టును గెలిపించాడు.
