24.1 C
Hyderabad
Monday, August 3, 2026

మల్టీలెవల్ మార్కెటింగ్ దందాలో పెద్ద తలకాయలు

Must read

📰 Generate e-Paper Clip

  • సాఫ్ట్ వేర్ డెవలపర్స్ తో  మాజీ ఎమ్మెల్యే చెట్టాపట్టాల్
  • సాఫ్ట్ వేర్ డెవలప్ ప్రోగ్రాంలో ఎమ్మెల్యే తనయుడు భాగస్వామా..?
  • డిపాజిట్ల ను సేకరించిన వాటిలో
  • ఆర్థిక లావా దేవిలతో పాటు.. కాల్ డాటా సేకరిస్తే మరిన్ని నిజాలు బయటకు

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ఇటీవల పోలీస్ శాఖ గుట్టు రట్టు చేసిన మల్టీలెవల్ మార్కెటింగ్ దందాలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అందుకు సోషల్ మీడియానే వేదిక కావడం గమనార్హం. ఇందూర్ జిల్లాలో సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన నుంచి లక్షల రూపాయాలు డిపాజిట్ల రూపంలో సేకరించి మోసం చేశారని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో దాని డొంక కదలడం విశేషం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సాప్ట్ వేర్ డెవలపర్స్ చుట్టూరా జరిగిన మల్టీ లెవల్ మార్కెటింగ్ దందాలో పెద్ద తలకాయాలు (పొలిటికల్ లీడర్లు) ఉండటంతోనే  గత మూడు సంవత్సరాలుగా జరిగిన డిపాజిట్ల సేకరణ, షెల్ కంపెనీల పేరిట వసూళ్లు, కన్ స్ట్రక్షన్ కంపెనీల పేరిట  హైద్రాబాద్, ఢిల్లీ, పుణే, ముంబాయి, గుజరాత్ రాష్ట్రాలను చుట్టిన డిపాజిట్ల సేకరణ బాగోతం బహిర్గతం కాలేదనే వాదనలు ఉన్నాయి. సాప్ట్ వేర్ ఇంజనీర్లను ముందు పెట్టి దందా జరిగిందనే వాదనలు ఉన్నాయి. సాప్ట్ వేర్ డెవలప్ మెంట్ తో పాటు దాని విస్థరణ, డిపాజిట్ల సేకరణ అంతా లీడర్ల కనుసన్నులలో జరిగిందని వారికి అధికారుల అండ కారణంగానే కోట్ల రూపాయల లావాదేవీల యవ్వారం బట్ట బయలు కాలేదని వాదనలు వినిపిస్తున్నాయి.

Big names in multilevel marketing

నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కాలంలో అతిపెద్ద ఫ్రాడ్ గా రూ.8 కోట్లకు (అనధికారికంగా కోట్లలో జరిగిన దందా) పైగా డిపాజిట్లను సేకరించి 125 మందిని మోసం చేసిన కేసును చెప్పవచ్చు. ఓ ఉపాధ్యాయుడి ఫిర్యాదు మేరకు సాప్ట్ వేర్ డేవలపర్స్ ను అదుపులోకి తీసుకోవడం తో అంతర్ రాష్ట్రాల వరకే జరిగిన మోసం కేసు వెలుగు చూసింది. 2022 నుంచి జరిగిన ఈ వ్యవహారం వెలుగు లోకి వచ్చే సరికి పొలిటికల్ లీడర్ల అండదండలపై చర్చ జరుగుతుంది. చిన్న సాప్ట్ వేర్ ఇంజనీర్లు చేసిన యాప్ ద్వార డిపాజిట్లను సేకరించి మోసం చేయడమే కాకుండా, బాధితులను బెదిరింపులకు గురి చేయడానికి ఐపీ నోటీసుల వరకు వ్యవహరం సాగడం ఇద్దరితో జరుగదని పెద్ద తలకాయలు వెనుక ఉన్నారని ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో డెవలపర్స్ అకౌంట్లు, వారితో జరిపిన లావా దేవీలపై స్థానికంగా బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. మోస పోయిన వారంత ఒక వర్గానికి చెందిన వారే కావడంతో పాటు మధ్యవర్తులు అందరు తెలిసిన వారే కావడంతో వారి వాదనలకు బలం చేకురుతుంది. ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు సాప్ట్ వేర్ డెవలపర్స్ తో అధికారంలో ఉన్న నాటి ఎమ్మెల్యే (ప్రస్తుత మాజీ) తో నేరుగా మాట్లాడేంత లావాదేవీలు ఎమిటనే చర్చ జరగుతుంది. ఆనాడు సాప్ట్ వేర్ డెవలపర్స్ తయారు చేసిన వారితో ప్రస్తుత ఎమ్మెల్యే తనయుడికి సంబంధాలు ఉన్నాయని నిజామాబాద్ అంతా కోడై కూస్తుంది.

ఇద్దరు సాప్ట్ వేర్ డెవలపర్స్ తయారు చేసిన యాప్ కోసం అప్పట్లో అధికారంలో ఉన్న అధికార పార్టీకి చెందిన నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే చాలా హడావిడి చేశాడని వినికిడి. సాప్ట్ వేర్ డెవలపర్స్ ను గుప్పిట పెట్టుకోవాడానికి అధికార బల ప్రయోగం చేశారనే టాక్ ఉంది. దానికి తోడు హైద్రాబాద్ కు చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే తనయుడు కుడా ఈ యాప్ డెవలప్ లో భాగస్వామి అని విశ్వసనీయ వర్గాల బోగట్టా. పెట్టుబడులు పెట్టిన వారికి దావత్ లకు అంతా స్పాన్సర్ గా ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే వ్యవహరించాడని టాక్ నడుస్తోంది. నాడు హైద్రాబాద్ లో విధులు నిర్వహించిన పొలీస్ అధికారులు కుడా వారికి సహకరించడంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంగా తయారైన సాప్ట్ వేర్ రాష్ట్రాల సరిహద్ధులను దాటిందని బాధితుల నుంచి సేకరించిన కోట్ల రూపాయలు కేవలం జల్సాలకు ఖర్చు అయ్యాయా అనే ఆనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యాప్ డెవలప్ చేసిన వారితో పలుమార్లు మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే వారు అడిగితే కోటి రూపాయలను కుడా డాలర్ల రూపంలో ఇచ్చేందుకు సిద్ధపడ్డారని టాక్ ఉంది. మరి కోట్ల రూపాయాల లావాదేవీల వెనుక గుట్టును రట్టు చేస్తారా అనే చర్చ జరుగుతుంది. లోతైన విచారణ జరిగితే జిల్లాలో క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే వ్యవహారం బహిర్గతం అయ్యే అవకాశం ఉంది. అలాగే పట్నంకు చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే తనయుడి దందా వ్యవహరం గుట్టు వీడుతుంది.

More articles

Latest article