రుద్రూర్, బతుకమ్మ : రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ఈ నెల 3వ తేది నుంచి 10వ తేదీ వరకు రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామాలల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ తారాబాయి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు భూములకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే భూ భారతి అవగాహన సదస్సు కేంద్రాల వద్దకు వచ్చి దరఖాస్తు అందజేయాలన్నారు. రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
