29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షల అంబులెన్స్ ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ లోని జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ యూనిట్, టీబీ నియంత్రణ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత సమగ్ర వ్యాధి నిర్దారణ పరీక్షల వాహనాన్ని తెలంగాణ రాష్ట్ర ఖనిజా బి వృద్ధి సంస్థ చైర్మన్, బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ఈరవత్రి అనిల్ కుమార్ , కలెక్టర్ అండ్ జిల్లా మెజిస్ట్రేట్ రాజీవ్ గాంధీ హనుమంతు, కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్యతో కలిసి ప్రారంభించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ మొబైల్ వ్యాన్ వివిధ వ్యాధులపై అవగాహన కల్పించడమే కాకుండా, అంటువ్యాధులు కానటువంటి బి.పి, షుగర్, లాంటి వాటికీ అలాగే అంటువ్యాధులు అయిన టిబి ( క్షయ), హైపటైటిస్ బి సి, హె.చ్.ఐ.వి మరియు సుఖవ్యాధులు లాంటి జబ్బులకు సంబంధించిన వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేస్తారు. ఈ వాహనం జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోని గ్రామాలలో పర్యటిస్తుంది. వీటితో పాటు క్షయ లక్షణాలు ఉన్నవారికి క్షయ పరీక్షలు, ఛాతి ఎక్స రే చేయడం జరుగుతుంది, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి అని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో అడిషనల్ కలెక్టర్ స్థానిక సంస్థలు అంకిత్, అడిషనల్ కలెక్టర్ రెవిన్యూ కిరణ్ కుమార్,జిల్లా వైద్య ఆరోగ్యాధికారిణి డాక్టర్ బి రాజశ్రీ, జిల్లా టిబి నియంత్రణ అధికారి డాక్టర్ దేవి నాగేశ్వరి,ఇంచార్జ్ డిప్యూటీ డి యం చ్ వో తుకారాం రాటోడ్, పిఓ డాక్టర్ రాజు, డీఎస్ఓ డాక్టర్ బి నాగరాజు, పి ఓ ఎన్ సి డి డాక్టర్ సామ్రాట్ యాదవ్, పి ఓ ఎం సి హెచ్ డాక్టర్ సుప్రియ,డాక్టర్ అవంతి, డాక్టర్ వెంకటేష్, డి హెచ్ ఈ ఘనపూర్ వెoకటేశ్వర్లు, టిబి కోఆర్డినేటర్ రవి, డి.పి.యం. సుధాకర్, డెమో నాగలక్ష్మి,

More articles

Latest article