ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో లబ్ధిదారులు ఎముల లత - కృష్ణ, నీరడి శంకర్ లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో సోమవారం తహసీల్దార్ తారాబాయి, ఎంపిడిఓ భీమ్ రావు, స్థానిక మండల నాయకులతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా తహసీల్దార్ తారాబాయి మాట్లాడుతూ.. నిరుపేదలందరికీ ఇల్లు కట్టించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అర్హులైన లబ్ధిదారులు ముందుకు వస్తే ప్రభుత్వం తరపున మంజూరు చేయడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో...