కమ్మర్ పల్లి, బతుకమ్మ : భగత్ సింగ్ 94వ వర్ధంతి సభ పోస్టర్ ను కమ్మర్ పల్లి సీపీఐ(ఎం. ఎల్)మాస్ లైన్ పార్టీ ఆఫీస్ వద్ద శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాస్ లైన్ మండల కార్యదర్శి బి. ఆశోక్ మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదులను రెండు పదుల వయస్సులోనే ఊరికించిన భగత్ సింగ్ ఉద్యమ స్ఫూర్తి వెల కట్టలేనిదని, అందుకే ఆయన్ని 23 సంవత్సరాల వయస్సులోనే ఆ బ్రిటిష్ దుండగులు ఉరి తీశారన్నారు. అలాంటి భగత్ సింగ్ ఉద్యమ స్ఫూర్తిని ఈనాటి యువత పునికిపుచ్చుకోవాలని కోరారు. ఆయన ఉద్యమ స్ఫూర్తితో యువత సమాజ మార్పు కోసం పోరాడాలన్నారు. ఈ కార్యక్రమం లో సీపీఐ (ఎం. ఎల్)మాస్ లైన్ నాయకులు సత్తెక్క, సురేష్, కిషన్, రాజగౌడ్, బాల కిషన్ తదితరులు పాల్గొన్నారు.