23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

 ఎసిబికి చిక్కిన భధ్రాచలం ఎఫ్ డిఓ..చర్ల ఇంచార్జీ ఆర్డిఓ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రూ.3.50 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టివేత

 భద్రాచలం, బతుకమ్మ:

బిటీ రోడ్డు నిర్మాణం కోసం చెట్లను నరికి వేసిన కేసు నమెదు చేయకుండా ఉండేందుకు లంచం తీసుకుంటు  భధ్రాచలం ఎప్ డిఓ, చర్ల ఇంచార్జీ డిఆర్ఓ ఎసిబికి చిక్కారు. ఖమ్మం రెంజ్ ఎసిబి డిఎస్పీ  రమేష్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి… చర్ల మండలం పుసుగుప్ప ప్రాంతంలో రోడ్డు వేస్తుండగా పోరపాటున రోడ్డుకు ఇరువైపుల కోన్ని చెట్లు దెబ్బతిన్నాయి. ఇటివల కాలంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో ప్రభుత్వం రోడ్లకు నిధులు విడుధల చేసింది. అక్కడ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ ను రిజర్వు ప్రాంతంలో బిటీ రోడ్డుకోసం కోన్ని చెట్లను తోలిగించారు. దానితో భధ్రాచలం ఎప్ డిఓ సుజాత, చర్ల ఇంచార్జీ అర్డిఓ క్రిష్ణయ్యతో కలిసి రూ.10 లక్షల లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఎసిబిని ఆశ్రయించారు. చర్ల ఇంచార్జీ అర్డిఓ క్రిష్ణయ్యతో, సుజాత తన కార్యాలయంలో భద్రాచలంలో రూ.3.50 లక్షల లంచం గురువారం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యండేడ్ గా పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి ఎసిబి కోర్టులో హజరు పరుస్తామని అధికారులు తెలిపారు.గత నెలలో కుడా  కోత్తగూడేం ఎప్ డిఓ ఎసిబికి చిక్కిన విషయం విధితమే. అటవీ శాఖ లో అవినీతి పేరుకుపోయింది. ఎటువంటి సమాచారమైన ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1046 కాల్ చేయాలని ఎసిబి డిఎస్పి వై రమేష్ అన్నారు

More articles

Latest article