. . . యజమాని మరణం తో సెలవు ప్రకటించిన నిర్వహకులు
. . . సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పోస్ట్
వెబ్ డెస్క్, బతుకమ్మ:
మట్కా ఆడేవారికి షాకిచ్చారు నిర్వహకులు. దాని యజమాని మరణం తో సెలవు ప్రకటించారు. సంబంధిత పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. దేశంలో మట్కా గురించి తెలియని వారు ఉండరు. పేకాట కంటే అధికంగా మట్కా దేశం మొత్తం విస్తరించింది. ఈ జుధంలోను నిత్యం కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. మట్కా కింగ్ లకు, ఏజెంట్లకు, బీటర్లు కొదవ లేదు. ఇంకా మట్కా చీటీ ల నుంచి ఆన్ లైన్ కు మారడంతో స్మార్ట్ ఫోన్ లో చాట్ లు డౌన్ లోడ్ చేసుకొని ఆడడం ఇప్పుడు రోటిన్. ఇలాంటి మట్కా మెయిన్ బజార్ అనే దానికి యజమాని ( ఓనర్) అనే వ్యక్తి చనిపోవడంతో ఈ నెల 6న మట్కా సెలవు ప్రకటించారు. సంబంధిత పోస్ట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది.
