23.2 C
Hyderabad

జేసీఐ ఇందూర్ కు ఉత్తమ పురస్కారాలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జేసీఐ బంజారా ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన ‘గోవిందం’ జోన్ కాన్ లో జేసీఐ ఇందూర్ మనోజ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన వివిధ కార్యక్రమాలకు అవార్డులు దక్కాయి. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సెల్ఫ్ డిఫెన్స్, జేసీఐ వారోత్సవాలు, పబ్లిక్ రిలేషన్స్, కమ్యూనిటీ డెవలప్ మెంట్, స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ, ఎడ్యుకేషన్ సపోర్ట్ విభాగాల్లో అవార్డులు అందుకున్నారు. అలాగే ఉత్తమ మాజీ జోన్ ఉపాధ్యక్షులుగా సెనేటర్ విజయానంద్ కు అవార్డు దక్కింది. జోన్ అధ్యక్షుడు గోవింద్ కంకాని, జోన్ డైరెక్టర్ శ్రేయ దీక్షిత్, రుబినా మదనీ, నిఖిల్, జోన్ అధికారులు సుచిత్ర కతూరి, బంగార్రాజు, నలరాపురం రాజు, గుంటి సంతోష్ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డులను జోన్ కో ఆర్డినేటర్ నయన్, పూర్వ అధ్యక్షులు విజయానంద్, లావణ్య, నిపుణ్ అందుకున్నారు. అవార్డులు అందుకోవడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ మనోజ్ కుమార్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

Best awards to JCI Indore

More articles

Latest article