29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రశాంతంగా బాన్సువాడ బంద్

Must read

📰 Generate e-Paper Clip

. స్వచ్ఛందంగా వ్యాపార సంస్థల మూసినేత

బాన్సువాడ, బతుకమ్మ: భాగ్యనగరంలోని ముత్యాలమ్మ ఆలయాన్ని ఓ వర్గానికి చెందిన వ్యక్తి ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ హిందూ ధార్మిక సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన, ధర్నాలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు  పట్టణానికి చేరుకున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరిస్తున్నారు. వ్యాపార సంస్థలు, స్వచ్ఛందంగా మూసివేసి బంద్ కు సహకరిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రవాణా సౌకర్యాన్ని యథావిధిగా కొనసాగాలని హిందూ ధార్మిక సంఘాలు సూచించాయి.

Bansuwada bandh in peace

More articles

Latest article