బతుకమ్మ, బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలానికి చెందిన అందాపూర్ గ్రామంలో శ్రీ బీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా కురుమ సంఘం నాయకులు మాట్లాడుతూ ఈ బీరప్ప కామరతి కళ్యాణం కురుమ సమాజం యొక్క ఐక్యతను ప్రతిబింబిస్తూ, వారసత్వ సంప్రదాయాలను కాపాడే దిశగా అడుగులు వేస్తోందనీ, ఈ కార్యక్రమంలో గ్రామంలోని కురుమ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారనీ అన్నారు. పాడి పశువులు, గొర్రెలు సంపదగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందనీ అన్నారు. ఈ మహోత్సవంలో కురుమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మేత్రి రాజు, మందర్న మాజీ సర్పంచ్ రావు బాగంగాధర్, బోధన్ కురుమ సంఘ పట్టణ అధ్యక్షుడు ఈరయ్య, సహకార సంఘం అధ్యక్షుడు దేవరావు, మండల కురుమ సంఘం అధ్యక్షుడు మేడి రవి పాల్గొన్నారు. అంబం సాయిలు, సాటపూర్ సాయిలు, జయరాం, బాబురావు, లక్ష్మణ్, భూమన్న, చందు, పోశెట్టి, భాస్కర్ లాంటి అనేక కురుమ బంధువులు హర్షాతిరేకంగా పాల్గొన్నారు. ఇక గ్రామ సహకార సంఘం అధ్యక్షుడు గంగిడ్ల ఈశ్వర్, గ్రామ సంఘం అధ్యక్షుడు కురుమ రాజు, హనుమాన్లు, సురేందర్, బలగం రాము, కురుమ లస్మయ్య, సాయిలు తదితరులు ఈ ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేశారు.
