25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

కమనీయం.. రమణీయం.. శ్రీవారి కళ్యాణం

Must read

📰 Generate e-Paper Clip

  • స్వామి వారి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్న ప్రముఖ సినీ ప్రముఖులు

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : స్వామి వారి కళ్యాణం అంటే లోక కళ్యాణం.. స్వామి వారి కళ్యాణం చూస్తేనే సకల పాపాలూ పోతాయి అని దేవనాథ జీయర్ స్వామి మరియు గంగోత్రి రామానుజదాసు స్వామి అన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఆదివారం స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామి వారి

Beautiful.. beautiful.. the wedding of Srivari

కల్యాణంలో పాల్గొంటే కన్యాదాన ఫలం వస్తుందని దేవనాథ జీయర్ స్వామి అన్నారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో పరిసరాలు భక్తులతో నిండిపోయింది. ఈ కార్యక్రమాల్లో దర్శకులు వంశీ పైడిపల్లి, సతీష్ వెగ్నేష,

Beautiful.. beautiful.. the wedding of Srivari

జబర్దస్త్ వేణు (బలగం), రచయిత చిన్ని కృష్ణ, నటులు బలగం మైమ్ మధు, సురేందర్ రెడ్డి, దేవనాథ జీయరు స్వామి, ఆచార్య గంగోత్రి రామానుజదాస్ స్వామి , ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, నర్సింహారెడ్డి, విజయసింహ రెడ్డి, ఎంపీటీసీ రాములు, పృథ్వీ, నర్సారెడ్డి, ప్రసాద్, రాజేశ్వర్, రమేష్, భాస్కర్, నరేందర్, మురళి, రాజేశ్వర్, యాజ్ఞాచార్యులు శిఖామణి, సత్యనారాయణ స్వామి శ్రీకర్ కుమారాచార్యులు, రోహిత్ కుమారాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

 

Beautiful.. beautiful.. the wedding of Srivari

More articles

Latest article