27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

కఠిన స్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

Be prepared to face tough situations

. ఇన్ చార్జి సీపీ సింధు శర్మ

. సీటీసీలో స్పోర్ట్స్ మీట్ ప్రారంభం

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: పోలీసు శాఖ సిబ్బంది కఠిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, క్రమశిక్షణ, శాంతి యుత వాతావరణం స్పోర్ట్స్ తో సాధ్యమని ఇన్ చార్జి సీపీ సింధు శర్మ అన్నారు. ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జానకంపేట్ శివారులఓ న్న పోలీసులు శిక్షణ కేంద్రంలో స్టయిఫండరీ క్యాడెట్ ట్రెయినీ కానిస్టేబుళ్లకు శిక్షణలో భాగంగా మంగళవారం స్పోర్ట్స్ మీట్ ను ఇన్ చార్జి సీపీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం పతాకాన్ని ఆవిష్కరించి క్రీడా పోటీలను ప్రారంభించారు. సీటీసీ ప్రిన్సిపాల్ అదనపు పోలీస్ కమిషనర్ ( అడ్మిన్) బి.కోటేశ్వర రావు,  అదనపు డీసీపీ ( లా అండ్ ఆర్డర్) జి బస్వారెడ్డి, ఎస్. శ్రీనివాస్ రావ్, ఏఆర్ ఏసీపీ నాగయ్య, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సి.ఐ శివరాం, ఆర్ఐ శ్రీపాల్, రిజర్వ్ ఇన్ స్పెక్టర్లు, ఆర్ ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

Be prepared to face tough situations

More articles

Latest article