27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

సంజాయిషీ లేదు.. సస్పెన్సనే..!

Must read

📰 Generate e-Paper Clip

  • రాష్ట్రవ్యాప్తంగా 160 మందికి
  • డి సి ఎస్ పేరిట ఏఈఓలపై వేటు
  • వ్యవసాయ శాఖ తీరుపై

హైదరాబాద్, బతుకమ్మ : డిజిటల్ క్రాఫ్ట్ సర్వేను అమలు చేయని ఏ ఈ ఓ (వ్యవసాయ విస్తీర్ణాధికారి)లపై రాష్ట్ర వ్యవసాయ శాఖ పరోక్షంగా చర్యలు తీసుకుంటున్నట్లు కనబడుతోంది. దీనిలో భాగంగానే సంజాయిషీ లేకుండానే రాష్ట్ర వ్యాప్తంగా 160 మందిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ విషయం శాఖలో చర్చనీయాంశంగా మారింది. దీన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో సస్పెన్షన్ కు గురైన బాధితులతో పాటు యూనియన్ నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ చెంతకు బయలుదేరారు.

డి సి ఎస్ అమలుపై :  భూమికి సంబంధించిన వివరాలను రెవెన్యూ వారు చేయాల్సి ఉండగా తమకు చేయమని చెప్తే సాధ్యం కాదని ఏఈవోలు తేల్చి చెప్పారు. నేలపై వేసే పంట విషయంతో పాటు రైతు బీమా తదితర పనులు చేయాల్సినా ఏ ఈ ఓ లు రెవిన్యూ దానిలో వేలు పెడితే రైతుల కన్నెర్రను చవి చూడాల్సి వస్తుందనే భయంతో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ డీసీఎస్ ను ముట్టుకోవట్లేదు. దీనిని పెడ చెవిన పెడుతున్నారని గ్రహించిన శాఖ ఉన్నతాధికారులు పరోక్షంగా వేటుకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

భీమా చెల్లింపు ఆలస్యం : గ్రామాలలో రెవెన్యూ అధికారులు ఉన్నప్పుడు మృతి చెందిన వారి వివరాలను వెనువెంటనే వ్యవసాయ శాఖ విస్తీర్ణాధికారికి పంపించేవారు. ప్రస్తుతం వారు లేనందున రైతు మృతి చెందిన సమాచారం ఆలస్యంగా అందుతుంది. ఆగస్టు నెలలో రైతు బీమాకు సంబందించిన పోర్టల్ సర్వర్ సుమారు 20 రోజులు పని చేయకపోవడంతో రైతు వివరాలు పంపడంలో ఆలస్యం అయిందని పేర్కొంటున్నారు. దీనిని అదునుగా చూసుకొని రైతులకు భీమా అందించడంలో నిర్లక్ష్యం చేశారని రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 160 మంది పై సస్పెన్షన్ వేటు వేయడం కలకలం రేపుతోంది. ఇదంతా డిజిటల్ క్రాఫ్ట్ సర్వేకు ఏఈవోలు తలోగ్గడం లేదని సంజాయిషీ లేకుండానే కుట్రపూరితంగా సస్పెన్షన్ చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధం అవుతున్నారు.

More articles

Latest article