
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: జిలాల విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ మంగళవారం పలు పాఠశాలలను తనిఖీ చేశారు. నిజామాబాద్ కేజీబీవీ, ముదక్ పల్లి, కులాస్ పూర్ జిల్లా పరిషత్ పాఠశాలలను డీఈవో సందర్శించారు. మధ్యాహ్న భోజనానికి వినియోగిస్తున్న బియ్యం, పప్పులు తదితర సామగ్రిని, భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. ఎస్ఏ-1 పరీక్షల నిర్వహణ తీరును పర్యవేక్షించి పలు సూచనలు చేశారు.

