రుద్రూర్, బతుకమ్మ: తెలంగాణ రాష్ట్రంలో రానున్న స్థానిక ఎన్నికల్లో సర్పంచ్, ఎంపిటిసి, జడ్పిటిసి, ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బిజెపి రాష్ట్ర పార్టీ నాయకులు పిలుపు మేరకు రుద్రూర్ మండల కేంద్రంలో బిజెపి పార్టీ కార్యాలయంలో బుధవారం కార్యకర్తల ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతు.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలల్లో సర్పంచ్, ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని బీజేపీ కార్యకర్తలకు తెలియజేశారు. మండలంలోని 10 గ్రామ పంచాయితీలు, 6 ఎంపీటీసీ స్థానలు అలాగే జెడ్పీటీసీ స్థానం, ఎంపీపీ కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలని, ఎప్పుడు ఎన్నికలు వచ్చిన రుద్రూర్ మండలంలో అన్ని గ్రామాల్లో కాషాయ జెండాను ఎగరవేయడానికి అందరు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల మండల ప్రభారీ జిల్లా కౌన్సిల్ మెంబర్ తృప్తి శివప్రసాద్, ప్రధానకార్యదర్శి ఏముల గజేందర్, వడ్ల సాయినాథ్ కోశాధికారి కటిక రామ్ రాజు, మండల సీనియర్ నాయకులు పార్వతి మురళి, మహిపాల్ సెట్, ఉపాధ్యక్షులు రేపల్లి సాయిప్రసాద్, వినోద్ కుమార్, కృష్ణం రాజు, జీలకర్ర విజయ్, బోజిగొండ అనిల్, ఓబీసీ మండల అధ్యక్షులు ఓదెల సతీష్ పవర్, యువ మోర్చా అధ్యక్షులు కుమ్మరి గణేష్, ఎస్సీ మొర్చా మండల అధ్యక్షులు శివప్రసాద్, మండల సెక్రటరీ అంకెరాజేష్, మహేందర్, నేమ్లీ గంగాధర్, శ్రీనివాస్, కుర్లెపు గంగాధర్,శంకర్, సుబ్బారావు, ధమ్మా సాయికుమార్, కన్నె శ్రీనివాస్, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.