- బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బగ్గలి అజయ్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీసీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బగ్గలి అజయ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సమాజంలో అందరికీ దమాషా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి.. ఎస్సీ, ఎస్టీ లకు అదే విధంగా అగ్రకుల నిరుపేదలకు కూడా వాళ్లెంతో వాళ్లకు అంత వాటా ఇచ్చి రిజర్వేషన్ ఇస్తున్నారని అన్నారు. కానీ అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది మాత్రం బీసీలకేనన తెలిపారు. 56% ఉన్న బీసీలకు ఇంకా 27% రిజర్వేషన్లనే కొనసాగించడం అన్యాయమన్నారు. మొన్న తెలంగాణ ప్రభుత్వం కులగణన చేయడాన్ని స్వాగతించామని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా కులగణన చేస్తానని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏది అయితే 42% రిజర్వేషన్లను బీసీలకు ఇవ్వాలని నిర్ణయించిందో దానిని వెంటనే కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టి వెంటనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ రిజర్వేషన్లు రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఉండాలి అని బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కోయ్యాడ శంకర్ అన్నారు. 130 కులాల బీసీల్లో ఇంకా నిరుపేద రేఖకు కింద దాదాపు వంద కులాలు ఉన్నాయని, వారు అభివృద్ధి చెందాలంటే ఏదైతే రాష్ట్రప్రభుత్వం 42 శాతం ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసిందో దానిని కేంద్రం కూడా వెంటనే బిల్ పాస్ చేసినప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుంది అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పేరుతో యువతకు ఇవ్వాలనుకున్న రుణాలను కూడా తొందరగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందులో కూడా బీసీలకు 42 శాతం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి యువజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బగ్గలి అజయ్, కొయ్యాడ శంకర్, విజయ్ బసవ సాయి, మురళి తదితరులు పాల్గొన్నారు.