29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

బీసీ వెల్ఫేర్ ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ సరెండర్

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  మహిళ ఉద్యోగినికి వేధింపులే కారణం

 నిజామాబాద్, బతుకమ్మ:

నిజామాబాద్ జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫిస్ సీనియర్ అసిస్టెంట్  ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బీసీ సంక్షేమ శాఖకు సరెండర్ చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. నిజామాబాద్ ఐడిఓసిలో ఉన్నబిసి సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగి ని వేధిస్తుండటంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు తీసుకున్నారు. గత కొంత కాలం క్రితం సదరు మహిళ ఉద్యోగి కారుణ్య నియామకం ద్వారా బీసీ వెల్ఫేర్ లో పనిచేస్తుండగా సీనియర్ అసిస్టెంట్ వేస్తున్నట్టు బాధితురాలు ఉద్యోగ సంఘాల ద్వారా ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్నారు.  గతంలో ఫిర్యాదు చేసిన  అవి బుట్టదాఖలు అయ్యాయి. సీనియర్ అసిస్టెంట్ కుడా కారుణ్య నియమాకం ద్వార విధులలో చేరిన  తోటి  మహిళ ఉద్యోగులను వేదింపులకు గురి చేయడం వివాధస్పధమైంది. కానీ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బాధ్యతలు తీసుకున్న తర్వాత విధి నిర్వహణలో వేధింపులు,  బాధ్యత రాహిత్య సేవలు ఉపేక్షించడం లేదు. ఉన్నపళంగా విచారణ చేయడం, బాధ్యులని తెలితే వెంట వెంటనే చర్యలు తీసుకోవడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి…

More articles

Latest article