31.4 C
Hyderabad

ఐద్వా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

Bathukamma celebrations under the aegis of AIDWA

Must read

📰 Generate e-Paper Clip

 

ఇందూర్, బతుకమ్మ :

 

నగరంలోని నాందేవాడలో ఐద్వా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత మాట్లాడుతూ  భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మహిళల ఆత్మగౌరవాన్ని నినబెట్టుకుందామని, హింస లేని సమాజానికై  పోరాడుదామన్నారు. దేశంలో జరుగుతున్నటువంటి సర్ పోరాటంలో ఎంతో మంది మహిళలు, యువతి, యువకులు కుటుంబాలను వదులుకొని శాంతియుతంగా నిరసన చేస్తుంటే,  నవరాత్రుల సందర్భంగా  అమ్మవారిని పూజిస్తే మరోపక్క మహిళలపై  హింసాత్మకంగా దాడులు చేస్తూ మహిళల్ని, మహిళా జర్నలిస్టులపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారికి కఠినమైన చర్యలు తీసుకోని శిక్షించాల్సింది పోయి ప్రమోషన్లు ఇచ్చి  భారతదేశా పరువు తీస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైనదని, ఈ ప్రభుత్వానికి గనక బుద్ధి చెప్పకపోతే రేపు రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని దారుణాలు ఎన్ని ఘోరాలు చూడాల్సి ఉంటుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. హింస లేని సమాజం  రావాలంటే  పోరాటం ఒక్కటే మార్గమని, పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అనే నినాదం స్ఫూర్తితో ముందుకు వెళ్లి భారతదేశాన్ని కాపాడుకునే బాధ్యత మనందరి పైన ఉందని మహిళలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఐద్వా నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలు అనిత,  సభ్యులు  అరుణ , సుమ, దీపికా, శైలజ,  నీలిమ,  లక్ష్మీ, శ్రీదేవి, శారదా తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article