32.7 C
Hyderabad

డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య

Deputy Tahsildar commits suicide

Must read

📰 Generate e-Paper Clip

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.  పాల్వంచలో సివిల్ సప్లై శాఖ గ్యాస్ గోడౌన్ లో  లక్ష్మీనారాయణ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఓ లాడ్జిలో లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ నోట్‌లో పలువురి పేర్లు ప్రస్తావించగా, కోటి రూపాయలు డిమాండ్ చేశారంటూ ఆరోపించారు. తన మృతికి కంప్యూటర్ ఆపరేటర్ రజిత, నాయిని రాజేష్, 10 టివి రిపోర్టర్ నాగచంద్ర,  ప్రైంనైన్ రిపోర్టర్ కలీం, టీవీ 9 రవి, బిగ్ టివి వెంకన్న అని రాసారు. కానీ అసలు పేరు బిగ్ టివి నాగేశ్వరరావు  కారణమంటూ ఆత్మహత్య లేఖలో పేర్కొన్నారు. పైన పేర్కొన్న అందరూ కలిసి మృతుడి ని కోటి రూపాయలు అడిగారని, లేని పక్షంలో కంప్యూటర్ ఆపరేటర్ రజిత ను వేదిస్తున్నానని తనపై  ఉన్నతాధికారులు కు ఫిర్యాదు చేసినట్లు మృతుడు లక్ష్మీ నారాయణ సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు.

More articles

Latest article