బతుకమ్మ, నాగిరెడ్డిపేట : ఏఎస్ఐ గా సిహెచ్.ఉమేష్ చేసిన సేవలు ఎంతో అభినందనీయమని స్థానిక ఎస్సై మల్లారెడ్డి, మండల మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు అన్నారు. నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో మూడు సంవత్సరాల పాటు ఏఎస్ఐ గా పనిచేసిన ఉమేష్ కు ఎస్ఐగా పదోన్నతి రావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాకు బదిలీ పై వెళ్ళారు. దీంతో బుధవారం నూతనంగా పదోన్నతి పొందిన ఎస్సై సిహెచ్. ఉమేష్ కు స్థానిక ఎస్సై మల్లారెడ్డి, తోపాటు పోలీస్ సిబ్బంది, మండల మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు సంవత్సరాల కాలంలో మండల ప్రజలకు ఏఎస్ఐ గా ఉమేష్ ఉత్తమ సేవలందించాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మల్లారెడ్డి, పోలీస్ సిబ్బంది, మండల మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నారు.