29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇంటర్ ఫలితాలలో బన్సల్ జూనియర్ కాలేజ్ విద్యార్థుల ఘన విజయం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ:

ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2026 ఫలితాల్లో నిజామాబాద్ బన్సల్ జూనియర్ కాలేజీ విద్యార్థుల అద్భుత ప్రతిభ కనబరిచిారు. ఈ సందర్భంగా కాలేజ్ లో అదివారం  ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించి సంస్థకు గర్వకారణంగా నిలిచినవిద్యార్థులను యాజమాన్యం ఘనంగా సన్మానించి సత్కారించారు. కళాశాల యాజమాన్యం తరుపున పింగిలి ప్రదీప్ రెడ్డి , మాదడి సాహితి, మేకల లక్ష్మణ్ , మేకల జమున, నరాల సుధాకర్ మాట్లాడుతూ ..ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో నమిత్ (హాల్ టికెట్ నెంబర్ 2645101235) శ్రీహిత (హాల్ టికెట్ నెంబర్ 2645107915) లు 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించి కళాశాల టాపర్ గా నిలిచారు. అదేవిధంగా మొదటి సంవత్సరం బైపీసీలో 440 మార్కులకు గాను 435 మార్కులు తన్యశ్రీ హాల్ టికెట్ నెంబర్ (2645106092) సాధించి కళాశాల టాపర్ గా నిలబడింది శ్లోకా జాదవ్ (హాల్ టికెట్ నెంబర్ 2645106110) 440 మార్కులకు గాను 433 మార్కులు సాధించి కళాశాల సెకండ్ టాపర్గా నిలిచింది ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో కూడా బన్సల్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఎంపీసీ విభాగంలో ధనుష్ ( 2645206632) 1000 మార్కులకు గాను 974 మార్కులు సాధించాడు. రోనిత్ (2645202179) 1000 మార్కులకు గాను 973 మార్కులు సాధించారు. బైపీసీ విభాగంలో ఎస్ ప్రవీణ్ ( 2645203626) 1000 మార్కులకు గాను 971 మార్కు సాధించాడు ఈ నరేష్ (2645206547) 1000 మార్కులకు గాను 961 మార్కులు సాధించారుఈ విజయానికి ముఖ్య కారణం అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం, క్రమబద్ధమైన బోధన విధానం, ప్రత్యేక పరీక్షా పద్ధతులు , విద్యార్థుల కృషి అని కాలేజ్ యాజమాన్యం పేర్కొంది. విద్యార్థుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, ప్రతి ఒక్కరికి వ్యక్తిగత మార్గదర్శనం అందించడం సంస్థ ప్రత్యేకతగా నిలిచింది. మా విద్యార్థుల ఈ విజయంపై ఎంతో ఆనందంగా ఉంది. వారి కృషి, తల్లిదండ్రుల సహకారం  మా సిబ్బంది అంకితభావం కలిసి ఈ ఫలితాన్ని సాధించాయి. భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి కొనసాగిస్తాము అని తెలిపారు.

Bansal Junior College students achieve great success in Inter results
Bansal Junior College students achieve great success in Inter results

 

More articles

Latest article