27.5 C
Hyderabad
Friday, July 31, 2026

మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం మన అందరి కర్తవ్యం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఆర్ ఎస్ ఎస్ జిల్లా ప్రచారక్ నర్రా వెంకట శివకుమార్

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

ప్రపంచ దేశాలకు ఆదర్శనీయమైన మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం మన అందరి కర్తవ్యమని ఆర్ ఎస్ ఎస్ జిల్లా ప్రచారక్ నర్రా వెంకట శివకుమార్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ లో కాకతీయ బస్తీ హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిధిగా జుక్కల్ పీఠాదిపతి గోపాల్ రాందాస్ ములే హాజరై మాట్లాడారు. గోవులను రక్షించుకునేందుకు కూడా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. అదే విధంగా చిన్నారులు, బాలికలు, మహిళలు, చివరకు వృద్ధులపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించే చట్టాలు వచ్చే వరకు తన పోరాటం ఆగదని అన్నారు. ప్రాచీన విలువలు, వేదాలు, యోగ, ధర్మ సూత్రాలను అర్థం చేసుకుని, ఆచరించడం గొప్ప విషయం అన్నారు. ప్రకృతిని గౌరవించడం, సత్యం, అహింస, నిస్వార్థ సేవ వంటి సద్గుణాలను అలవర్చుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ధర్మాన్ని ఆచరిస్తూ, భావితరాలకు అందించాలన్నారు. హైందవ ధర్మం జోలికి వస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఇటీవల నిర్వహించిన మహాకుంభమేళలో లక్షలాది మంది సన్యాసులు, సిద్ధులు, మునులు పాల్గొన్నారని, హద్దులు మీరితే హైందవ ధర్మాన్ని కాపాడేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారని, తాము ప్రాణ త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ సేవిక సమితి అధ్యక్షురాలు సరోజన, హిందూ సమ్మేళనం అధ్యక్షురాలు లక్ష్మి నర్సయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందు ప్రియా, కౌన్సిలర్లు రాంశెట్టి హర్షిత, అర్కాల ప్రభాకర్ యాదవ్, రాహుల్ గౌడ్, వినోదబాయ్, ఆర్ ఎస్ ఎస్ హిందూ సమ్మేళనం ప్రతినిధులు పాల్గొన్నారు.

More articles

Latest article