రమేశ్ సవాల్ కు కేటీఆర్ సిద్ధమా బండి సవాల్
కరీంనగర్, బతుకమ్మ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ’ ఎంపీ సీఎం రమేశ్ చెప్పింది వాస్తవం. ఎన్నికల్లో కేసీఆర్ మొదట కేటీఆర్ కు టికెట్ ఇవ్వలేదు. సిరిసిల్లాలో కేటీఆర్ కు టికెట్ ఇప్పించింది సీఎం రమేశ్‘ అని బండి వ్యాఖ్యనించారు. రమేశ్ సవాల్ కు కేటీఆర్ సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. సీఎం రమేష్ చేసిన ఆర్థిక సహాయం వల్లే కేటీఆర్ ఈ రోజు ఎమ్మెల్యే అయ్యాడన్నారు. బీఆర్‌ఎస్‌ను నడిపే స్థితిలో లేకనే బీజేపీలో విలీనం చేస్తానని అన్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. కాగా, లిక్కర్ కేసులో కవితపై విచారణ ఆపితే బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తామని కేటీఆర్ అన్నారని ఎంపీ సీఎం రమేశ్ వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే.
