29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ

Must read

📰 Generate e-Paper Clip

యాదగిరిగుట్ట, బతుకమ్మ:  శ్రావణమాసం తొలి ఆదివారం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు బారులు తీరారు.  స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణం లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారి ధర్మ దర్శనానికి గంట సమయం, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. ప్రసాద విక్రయశాల, కొండ కింది సత్యనారాయణ స్వామి వ్రత మండపం, లక్ష్మీ పుష్కరణి, కారు పార్కింగ్, బస్టాండ్లలో భక్తుల రద్దీ నెలకొంది.

More articles

Latest article