28.2 C
Hyderabad

ఆదాయపు పన్ను శాఖ జూనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా బండి గణేష్

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణానికి చెందిన బండి గణేష్ తెలంగాణ హైకోర్టులో ఆదాయపు పన్ను శాఖకు జూనియర్ స్టాండింగ్ కౌన్సెల్‌గా నియమితులయ్యారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ విషయంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన మూడేళ్ల పాటు జూనియర్ స్టాండింగ్ కౌన్సెల్‌గా కొనసాగుతారు. బండి గణేష్ గత కొన్ని సంవత్సరాలుగా హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. యువ న్యాయవాదిగా, ఆదాయపు పన్ను శాఖకు హైకోర్టులో జూనియర్ స్టాండింగ్ కౌన్సెల్‌గా పనిచేసే అవకాశం ఆయనకు లభించింది. బండి గణేష్ పదోన్నతిపై గురువారం ఆర్మూర్ ప్రజలు సంతోషం వ్యక్తం చేసి ఆయనను అభినందించారు.

More articles

Latest article