- ఆక్రమణల తొలగింపు
- ‘బతుకమ్మ’ ఎఫెక్ట్

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో పార్కు స్థలం కబ్జా పేరిట బతుకమ్మలో వచ్చిన కథనంపై నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించారు. కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులోని నర్సింహా అపార్ట్ మెంట్ ప్రక్కన గల ప్రైవేట్ వెంచర్ లో 1998లో ఓపెన్ ప్లేస్ గా వదిలేసిన స్థలాన్ని

కొందరు కబ్జా చేయడానికి పార్కు స్థలం చుట్టు రేకుల షెడ్డును నిర్మించారు. ఈ నెల 2న బతుకమ్మ పత్రికలో వచ్చిన కథనంపై బల్ధియా అధికారులు స్పందించారు. సర్వే నంబర్ 219(అ), 219(ఆ)లో ఉన్న సుమారు వెయ్యి గజాల స్థలంలో వేసిన రేకుల షెడ్డు పెన్సింగ్ ను జేసీబీల ద్వారా కూల్చివేశారు. రెండు రోజుల క్రితం స్థానిక కాలనీవాసులు సంబంధిత వెంచర్ లో వదిలేసిన ఖాళీ స్థలం పార్కు కోసమని తమకు ప్లాట్లుగా విక్రయించారని మీడియాతో గోడు వెళ్లబోసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు కబ్జాలను తొలగించి సంబంధిత స్థలంలో ఆక్రమణలు జరిగితే కఠినచర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు.

