26.3 C
Hyderabad
Monday, August 3, 2026

తెయూ తెలుగు విభాగంలో బాలామణి కి డాక్టరేట్ ప్రదానం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ తెలుగు విభాగం పరిశోధక విద్యార్థి సి. బాలామణి   డాక్టర్ సిహెచ్ లక్ష్మణ చక్రవర్తి అసిస్టెంట్  ప్రొఫెసర్ పర్యవేక్షణలో “ముదిగొండ వీరభద్రయ్య సాహిత్య విమర్శ- సమగ్ర పరిశీలన” అనే అంశంపై పరిశోధన జరిపారు.ఈ రోజు జరిగిన బహిరంగ మౌఖిక పరీక్షకు ఎక్సటర్నల్ ఎగ్జామినర్ గా హైదరాబాదు కేంద్రయ యూనివర్సిటీ ఆచార్య వారిజారాణి  హాజరై  పరిశోధన సిద్ధాంత గ్రంధాన్ని  సమగ్రంగా అమూల్యాంకనం చేసి సంతృప్తి వ్యక్తం చేసి పీహెచ్డీ  డిగ్రీ ప్రదానానికి ఆమోదం తెలిపారు. అనంతరం   పరిశోధకురాలు బాలామణిని అభినందించారు. ఈ బహిరంగ మౌఖిక పరీక్షకు తెలుగు విభాగాధిపతి ఆర్డిస్ డిన్ ఆచార్య కే లావణ్య. ఆచార్య పీ కనకయ్య, డాక్టర్ అబ్దుల్ కవి, ప్రొఫెసర్ మూసా ఖురేషి  డాక్టర్ రమణా చారి, డాక్టర్ సమత,  కాంటాక్ట్ అధ్యాపకులు, పరిశోధక విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు.

More articles

Latest article