24 C
Hyderabad
Sunday, August 2, 2026

రేపటి నుంచి బ్యాడ్మింటన్ టోర్నీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నగరంలోని క్లబ్ ప్రాంగణంలో రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను శని, ఆదివారాల్లో నిర్వహించనున్నట్లు క్లబ్ కార్యదర్శి చిలివేరి సత్యనారాయణ తెలిపారు. క్లబ్  లో శుక్రవారం సంయుక్త కార్యదర్శి వెంకట్ రాములు, కోశాధికారి గంగాకిషన్ తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొననున్నారని, శనివారం నిర్వహించనున్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్, క్లబ్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ హనుమంతు హాజరవుతారన్నారు. క్లబ్ ఉపాధ్యక్షుడు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ అధ్యక్షత వహించనున్నారని, అతిథులుగా క్లబ్ ఉపాధ్యక్షులు నిజామాబాద్ ఇన్ చార్జి పోలీస్ కమిషనర్ సింధు శర్మ, అదనపు జిల్లా కలెక్టర్ కిరణ్ కుమార్ పాల్గొననున్నారని తెలిపారు. ఆదివారం సాయంత్రం నిర్వహించనున్న ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల, అతిథులుగా పోలీస్ కమిషనర్ సింధు శర్మ, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పాల్గొంటారని, తాహెర్ బిన్ హందాన్ అధ్యక్షత వహిస్తారన్నారు. దేశానికి స్వాతంత్ర్య రాకముందే నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఏర్పాటు చేశారని , దశాబ్దాల చరిత్ర ఉన్న క్లబ్ జిల్లా చరిత్రలో తనకంటూ ప్రత్యేకత కలిగి ఉందన్నారు.  క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికితీయడం,రాష్ట్ర, జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనే విదంగా క్రీడాకారులను తయారు చేయడమే బ్యాడ్మింటన్ టోర్నీ లక్ష్యమని సత్యనారాయణ తెలిపారు. సమావేశంలో క్లబ్ సభ్యుడు బీడీ దాస్, కిరణ్ కుమార్ గౌడ్, డాకం సాయిలు, డాక్టర్ రాములు, అరవింద్, రచ్చ మురళి, ఆశ నారాయణ, వీరేందర్ పర్మర్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article