రేపటి నుంచి బ్యాడ్మింటన్ టోర్నీ

నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నగరంలోని క్లబ్ ప్రాంగణంలో రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను శని, ఆదివారాల్లో నిర్వహించనున్నట్లు క్లబ్ కార్యదర్శి చిలివేరి సత్యనారాయణ తెలిపారు. క్లబ్  లో శుక్రవారం సంయుక్త కార్యదర్శి వెంకట్ రాములు, కోశాధికారి గంగాకిషన్ తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొననున్నారని, శనివారం నిర్వహించనున్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్, క్లబ్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ హనుమంతు హాజరవుతారన్నారు. క్లబ్ ఉపాధ్యక్షుడు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్...