నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగర్ శివారులో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మల్లారం గండిలో జరిగింది . వడ్ల లోడుతో వెళ్తున్న లారీ మల్లారం అడవి ప్రాంతంలో బీడీల లోడుతో వస్తున్న ఓమినీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్యాబిన్లో ఇరుక్కుని వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించగా, డ్రైవర్ మృతి చెందినట్లు వారు నిర్ధారించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు రోడ్డు ప్రమాదంపై రూరల్ పోలీసులకు సమాచారం అందించారు.
