24 C
Hyderabad
Sunday, August 2, 2026

బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను నెరవేర్చాలి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ : నాగిరెడ్డిపేట : మండల కేంద్రంలో శనివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహ ఆవరణలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి మండల ఎమ్మార్పీఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులుర్పించారు. స్వాతంత్ర సమరయోధుడిగా, ఉప ప్రధానిగా దేశానికి అందించిన విశేష సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు తొంట సాయిలు, నాయకులు దావీద్, రాజు, రవి, సాయిలు, దేవ సహాయం, రవి, అశోక్, సాయిలు, బిక్షపతి, సాయిలు  తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article